వైసీపీ (YCP):
జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో అరాచకాలు తప్ప అభివృద్ధి లేదని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. పట్టణంలోని గౌడ లే అవుట్ లో ఆయన పర్యటించారు. వైసీపీ (YCP)కి చెందిన 50 కుటుంబాల వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో నిత్యావసరాల ధరలతో పేద,మధ్య కుటుంబాల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏమి తినలేని, కొనలేని దుస్థితికి వైసీపీ సర్కార్ తీసుకొచ్చిందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
జగన్ గెలిచాక తొమ్మిది సార్లు కరెంట్ చార్జీలను పెంచాడన్నారు. వంట గ్యాస్ ధరలు కూడా మూడింతలు పెరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవని కాలవ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్నారు. చంద్రబాబు పాలనతోనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. తేదేపా పార్టీ ఉన్నప్పుడు గోడ లే అవుట్ లో తాగు నీటి సౌకర్యం, ఎన్నో రకాల ప్రజా సమస్యలు తీర్చమన్నారు. రాబోయే రోజుల్లో తెదేపా పార్టీ అధికారంలోకి రాగానే మిగిలిన ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.