ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా సొంగా. రోషన్ కుమార్ (Songa Roshan Kumar) చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో గల మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో గల శ్రీ రామా సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి చింతలపూడి చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో గల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నామినేషన్ తరువాత సొంగా రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నా మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ సీటు మారుస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు,నామినేషన్ కార్యక్రమానికి అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారని అన్నారు.ప్రజలు నన్ను ఎమ్మెల్యే గా మరియు పుట్టా. మహేష్ యాదవ్ ను ఎంపీ గా గెలిపించాలని అన్నారు. గత 10 సంవత్సరాలుగా నా జీతంలో 10 శాతం మా ఆవిడ జీతంలో నుండి 10 శాతం ఖర్చుపెట్టి పేద ప్రజలకు సేవ చేసాను, అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను అలాగే చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళతాను అని ఆయన అన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి