పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 28 కోట్లతో చేపట్టిన ఏటిగట్టు పనుల్లో డొల్లతనం మూడు నెలల్లోనే బయటపడింది. అమరేశ్వర స్వామి గుడి నుంచి బూడిదల రేవు వరకు చేపట్టిన 100 మీటర్ల ఏటిగట్టు పనుల్లో సుమారు 50 మీటర్లు కొట్టుకుపోయింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కోతకు గురవుతూ వస్తుంది. గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం వరద లేకుండానే గట్టు కోతకు గురి కావడంతో పనులు నాణ్యత పై పొన్నపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల తీరుపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తీవ్రస్థాయి విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఈ పనుల్లో బినామీలుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. పనుల నాణ్యతలో నాసిరకమైన రాళ్లు వినియోగిస్తున్నారని, ప్రభుత్వం దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ రోజు ఏటి గట్టుకు పెద్ద ప్రమాదం వాటిల్లింది.
ఏటిగట్టు పనుల్లో బయటపడ్డ డొల్లతనం…
73
previous post