జగన్ ను సీఎం చేసిన పాపానికి రోడ్డున పడ్డాం.!

anganwadi workers protest on road

Advertisements

&NewLine;<p>ఎమ్మిగనూరు&comma; కర్నూల్ జిల్లా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నేటికీ 40 వ రోజుకు చేరుకుంది&period; అందులో భాగంగా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు సోమప్పా సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి శివ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు&period; అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కే పరిస్థితి ఎదురైందని ఆరోపించారు&period; ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు&comma; కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు&period; ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు&period; 40 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు&period; ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు&period;<br>ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని&comma; లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసి&comma; ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.