67
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు. అంగన్ వాడీ టీచర్లను, ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కార్యాలయం లోపలకి వెళ్లడానికి లక్ష్మి కుమారి ప్రయత్నించినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ అడ్డుపడటంతో వెనుతిరిగారు. శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు కోరినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ వినకుండా సిఐటియు నాయకులతో కలిసి భైఠాయించారు. అంగన్ వాడీలను రెడ్డిగూడెం ఎస్ ఐ శ్రీను సర్దిచెప్పినప్పటికీ పట్టించుకోకుండా ధర్నా నిర్వహించారు.