అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 38 రోజులుగా అంగన్వాడి టీచర్లు చేస్తున్న నిరవధిక సమ్మె శుక్రవారం 39వ రోజుకు చేరింది. అందులో భాగంగా గుత్తి పట్టణంలో ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటంతో దీక్ష చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ విజయవాడలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తున్న నేపథ్యంలో ఈ క్రమంలో అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని 39వ రోజు దీక్షా శిబిరంలో అంబేద్కర్ చిత్రపటంతో నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రాబోవు కాలంలో ఈ నిరవధిక సమ్మె మరింత ఉధృతం చేస్తామని జగన్ సర్కారుకు హెచ్చరించారు.
అంబేద్కర్ చిత్రపటంతో దీక్ష చేస్తున్న అంగన్వాడీలు…
65
previous post