అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి..

Anganwadi

Advertisements

&NewLine;<p>అంగన్వాడీల సమ్మె ఆందోళన 5వరోజుకు చేరింది&period; ఈరోజు ఉలవపాడు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడిలు కళ్ళకు గంతల కట్టుకొని నల్ల చీరలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు&period; ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు&comma; పట్టింపులకు పోకుండా అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు&period; కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు&period; సమస్య పరిష్కారం చేయకుండా బెదిరింపులతో ఉద్యమాన్ని అణచాలనుకోవడం ఆయన నియంత్రత్వ పాలనకు నిదర్శనం అని అన్నారు&period; సచివాలయ వాలంటీర్లు సిబ్బంది చేత బలవంతంగా తాళాలు పగలగొట్టి సెంటర్లు తెరిపించడం అంటే తన ఆస్తులను తనే ధ్వంసం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు&period; తాళాల మీద కొట్టే ప్రతి దెబ్బ రాబోయే కాలంలో సమ్మెట్టు పోటుల్లాగా ఆయన మీదనే ఆ దెబ్బలు తగులుతాయి అనేది గుర్తించుకోవాలని అన్నారు&period; వెంటనే అంగన్వాడీలను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని ఆయన కోరారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకా&period;లతా రెడ్డి ప్రాజెక్టు సెక్టార్ లీడర్లు ఎస్&period;కె పద్మజ&comma; బీ&period;మార్తమ్మ &comma;సిహెచ్ పద్మజ &comma;పర్రె తిరుపతమ్మ&comma; కృష్ణకుమారి &comma;ప్రసన్న&comma; కామాక్షి&comma; పద్మ &comma;à°¡à°¿ రమాదేవి&comma; పొంతగాని రమణ తదితరులు పాల్గొన్నారు&period; అంగన్వాడీలు ఆట పాటలతో ధర్నా శిబిరంలో డాన్సులతో ఆకట్టుకున్నారు&period; కోలాటం ప్రదర్శించారు ఎర్రజెండా ఎర్రజెండా ఎన్నియాలో …&period;అది పేదలపాటి జెండాఎన్నియాలో… అని నృత్యం చేశారు&period; శైలజ&comma; à°¡à°¿ వరలక్ష్మి&comma; సిహెచ్ కోటేశ్వరి కసుకుర్తి కోటేశ్వరి&comma; శివలీల&comma; మాంచాలి&comma; శ్రీదేవి తదితరులు కళారూపాలను ప్రదర్శించారు&period; ఈ కార్యక్రమంలో సి&period; హెచ్&period; ఇందిరావతి&comma; పద్మజ లతా రెడ్డి పద్మజ ప్రవీణ గీత అమీరున్నీసా తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..