117
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజుల్లో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. కొంత కాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.