101
తెలంగాణలో ఇప్పటికే నాలుగు గ్యారెంటీ పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం.. మరో గ్యారెంటీ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 11 పథకం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే పథకం అమలు కోసం కావాల్సిన నిబంధనలు, విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇల్లులేని పేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు రూపాయలు అందించనుంది.