మరో కీలకమైన అంతర్జాతీయ సమావేశం..

UNESCO World Heritage Committee

Advertisements

&NewLine;<p>భారత్‌ వేదికగా మరో కీలకమైన అంతర్జాతీయ సమావేశం ఖరారైంది&period; తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్‌కు భారత్ ఈ ఏడాది అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది&period; ఈ ఏడాది జులై 21 నుంచి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా 46à°µ సెషన్ జరగనుంది&period; యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విశాల్ శర్మ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు&period; యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి అని తెలిపారు&period; ఈ కమిటీకి అధ్యక్షత వహించడం ద్వారా ప్రపంచ స్థాయిలో సాంస్కృతిక&comma; సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు&comma; వాటి పరిరక్షణలో భారత్ తనవంతు సహకారాన్ని అందించే అవకాశం దక్కింది&period; 2024లో కమిటీకి సారధిగా&comma; అతిథిగా వ్యవహరించి చర్చలకు నాయకత్వం వహించనుంది&period; కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది&period; ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సాంస్కృతిక&comma; వారసత్వ ప్రాంతాలను రక్షించడంలో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.