ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరగా.. సీఎం కేజ్రీవాల్ కస్టడీని మరో నాలుగు రోజుల పాటు విధిస్తూ.. కోర్టు తీర్పునిచ్చింది. ఈడీ స్వాధీనం చేసుకున్న సీఎం ఫోన్ పాస్ వర్డ్ లను ఆయన చెప్పడం లేదని.. అందులో కీలకమైన సమాచారం ఉందని.. ఆ ఫోన్లను ఫారెన్సీక్ కు పంపినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది.
ఇది చదవండి: మళ్ళీ వచ్చేది మోడీ నే… ఇది ఫిక్స్
ఆ రిపోర్ట్ ఆధారాలు చాలా కీలకం అని వారు అభిప్రాయపడ్డారు. కాగా ఈ రోజు ఉదయం.. లిక్కర్ స్కాం కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న కస్టడీలో ఉన్న ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించే అంశం తమ పరిధిలోకి రాదని.. ఇది పూర్తిగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. కస్టడీ పొడిగిస్తూ.. కేజ్రీవాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి