Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home National పార్లమెంట్ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల

పార్లమెంట్ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల

by Satya
Release of polling notification for the second phase of Parliament elections


రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్(Parliament) స్థానాలకు పోలింగ్..

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) షెడ్యూల్ విడుదల చేసి.. తొలి దశ పోలింగ్ నోటిఫికేషన్ రిలీజ్(Polling notification release) చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్.. తాజాగా రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెకండ్ ఫేజ్‌లో దేశంలోని 12 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో దేశవ్యాప్తంగా మొత్తం 88 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. నేటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4 నామినేషన్ల దాఖలకు చివరి తేదీ.

మే 13న నాలుగో దశలో పార్లమెంట్ ఎన్నికలు..

జమ్మూకాశ్మీర్(Jammu and Kashmir) మినహా మిగిలిన 11 రాష్ట్రాల్లో ఏప్రిల్ 5న నామినేషన్లు పరిశీలించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఏప్రిల్ 6వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కాగా, మార్చి 16న కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ మొత్తం ఏడు దశల్లో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలైనా ఏపీ, తెలంగాణలో మే 13న నాలుగో దశలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: Lok Sabha 2024: కాంగ్రెస్ ఏడవ జాబితా విడుదల..!


రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని …
నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సంచలన ప్రకటన.
దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశం..పార్లమెంట్ లోపల, బయట తీవ్ర దుమారాన్ని రేపుతోంది. …
సోనమ్‌ వాంగ్‌చుక్‌కు తీవ్ర అస్వస్థత.
ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి    


    

Advertisements

You may also like

Our Visitor

042274
Total views : 223705

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: