ఫ్రీజర్ లో శవానికి చీమలు..

Girl's Dead Body

Advertisements

&NewLine;<p>కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్ష గదిలో ఉంచిన మృతదేహానికి చీమలు పట్టడంపై&period;&period; బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన చోటుచేసుకుంది&period; ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ బాదితులు రోడ్డు పై బైటాయించి నిరసనకు దిగారు&period; ఈనెల 29వ తేదీ జమ్మలమడుగు లోని బీసీ కాలనీ లో పదహారేళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది&period; ఇంతవరకు శవ పరీక్ష నిర్వహించలేదు&period; పనిచేయని ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టడంతో చీమలు పట్టాయి&period; మంగళవారం బంధువులు వచ్చి మృత దేహాన్ని చూసి ఆవేదనతో ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు&period; ఆసుపత్రి సిబ్బంది నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు&period; పట్టణ ఎస్ఐ సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడారు&period; ఫ్రీజర్ పనిచేయలేదని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period; ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ భాష ను వివరణ కోరగా&period;&period; ఫ్రీజర్ తెరిచినప్పుడు లైట్లు వెలగడంతో అది పనిచేస్తుందని అనుకుని శవాన్ని అందులో ఉంచారని చెప్పారు&period; బాధితులు తనకు ఫిర్యాదు చేశారని&period;&period; విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..