దేశానికే ఆదర్శంగా ‘ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌’ .

దేశానికే ఆదర్శంగా 'ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌'

Advertisements

<p>దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు&period; ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సొంత బిడ్డల్లా భావించి&comma; నూరు శాతం ఎన్‌రోల్‌మెంట్ సాధనపై అధికారులు&comma; ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో దృష్టి సారించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు&period; ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన పబ్లిక్ స్కూల్ విద్యా విధానాన్ని తీసుకురావడానికి క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా విద్యాశాఖలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు&period; సాంకేతికతతో కూడిన నాణ్యమైన విద్యతో పాటు&comma; విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>అమరావతి సచివాలయంలో మంత్రి నారా లోకేశ్ డీఈవోలు&comma; ఈపీసీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; ఏపీలో అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ ప్రకటించారు&period; ఇందులో భాగంగానే మన ఉపాధ్యాయులను విదేశాలకు పంపి&comma; అక్కడ అధ్యయనం చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తామని వెల్లడించారు&period; ఓపెన్ మార్కెట్‌తో పోటీపడేలా విద్యావ్యవస్థను బలోపేతం చేయాలన్నారు&period; గతంలో విద్యాశాఖలో కనీస డేటా బేస్&comma; విజిబిలిటీ లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు&period; ఈ లోపాన్ని సవరిస్తూ&comma; పక్కా సమాచారంతో కూడిన డ్యాష్ బోర్డును సిద్ధం చేశామని దీని ఆధారంగానే డీఈవోలు&comma; ఏపీసీలు భవిష్యత్ కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు&period; త్వరలోనే ఈ డ్యాష్ బోర్డు యాక్సెస్‌ను ప్రజలకు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..