ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో టీడీపీ మహానాడు..

Advertisements

<p>తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఈనెల 27&comma; 28 తేదీల్లో జరగనుంది&period; మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ పద్ధతిలో జరగబోతోందని టీడీపీ సీనియర్ నాయకులు&comma; ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు&period; పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు 37 మహానాడులు విజయవంతంగా జరిగాయని ఆయన గుర్తుచేశారు&period; మొదట ఈ మహానాడును నెల్లూరులో భారీ ఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని&comma; నెల్లూరులో జరిగి ఉంటే దాదాపు 7 వేల బస్సులు&comma; వేలాది కార్లు&comma; ట్రక్కులు వచ్చేవని అన్నారు&period; అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గౌరవిస్తున్నామన్నారు&period; దేశంలో ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని&comma; ఈ నిర్ణయాన్ని ఏపీలోనూ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారని అన్నారు&period;<br &sol;>&NewLine;అందుకే నెల్లూరు కాకుండా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు&period; ప్రస్తుత పరిస్థితుల్లో వర్చువల్ హైబ్రిడ్ విధానమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు&period; నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో అందరిలోనూ భారీ ఆసక్తి నెలకొందన్నారు&period; ఈ కార్యక్రమం మొత్తం ఆయన నేతృత్వంలోనే అట్టహాసంగా జరగబోతోందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు&period; చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్&comma; లోకేశ్ నిరంతర ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి అండ తోడవ్వడంతో రాష్ట్ర అభివృద్ధికి సరికొత్త బాటలు పడ్డాయని అన్నారు&period; గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెండేళ్లలోనే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు&period; అనేక పరిశ్రమలు స్థాపించబడటంతో యువతకు మెండుగా ఉద్యోగ&comma; ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు&period; రాష్ట్రం నాశనమవ్వాలని కోరుకునే ఏకైక పార్టీ ఒక్క వైసీపీ మాత్రమేనని ధ్వజమెత్తారు&period; ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను తామెక్కడా చూడలేదని సోమిరెడ్డి మండిపడ్డారు&period; రాష్ట్ర అభివృద్ధి&comma; భవిష్యత్తు కార్యాచరణపై ఈ మహానాడులో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..