చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం

Advertisements

<p>కార్యకర్తే పార్టీ అధినేత అనేది&period;&period; మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు&period; మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు&period; సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు&period; టీడీపీ అధినేత&comma; సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది&period; ఈ భేటీలో మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది&period; మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది&period; దీనికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;<p>జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచీ వెన్నుదన్నుగా ఉన్నారనీ&period;&period; వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని చెప్పారు&period;&period; హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు&period; మొదట నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలనుకున్నా&period;&period; ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించారు&period; ఈ మేరకు పార్టీ పొలిట్ బ్యూరో చర్చించి&period;&period;ఇందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులకు సమాయాత్తం చేశారు సీఎంచంద్రబాబు&period; మహనాడును పకడ్బందీగా నిర్వహించేందుకు పొలిట్ బ్యూరో కసరత్తు చేసింది&period; ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభిద్దామన్న చంద్రబాబు&period;&period; ప్రతీ వక్తా తమకు కేటాయించిన అంశంలో విషయం సూటిగా చెప్పాల ని సీఎం సూచించారు&period; కార్యకర్తే పార్టీ అధినేత అనేది స్పష్టంగా చెప్పాలన్నారు&period; మహిళలకు ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు&period; సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..