ఏపీ తీరం సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్..

ఏపీ తీరం సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి&comma; ఆర్థిక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చేందుకు ఒక విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు&period; రాష్ట్రంలోని సముద్ర సంపదను అందిపుచ్చుకుంటూనే&comma; తీర ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు&period; సముద్రతీర అభివృద్ధిపై నిపుణులు&comma; ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చ జరుగుతోందని&comma; సముద్ర గర్భంలోని అపారమైన వనరులను వెలికితీయడం ద్వారా విస్తృత ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు&period; ఏపీలో ఇప్పటికే ఆక్వాకల్చర్‌ను గణనీయంగా అభివృద్ధి చేశామని&comma; రొయ్యలు&comma; చేపల సాగు&comma; ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు&period; కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా ఆక్వా ఉత్పత్తుల్లో వాల్యూ అడిషన్ జరగాలని&comma; తద్వారా రైతులకు&comma; రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తుందని నిర్దేశించారు&period; అదే సమయంలో ఆక్వా వ్యర్థాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని&comma; ఈ సవాళ్లను అధిగమించేందుకు పూర్తిస్థాయి అధ్యయనం జరగాలని సూచించారు&period; తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మెరైన్ బయోడైవర్సిటీని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సీఎం స్పష్టం చేశారు&period; సముద్రాలతో పాటు తీరప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మినరల్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి&comma; ఆ వనరులను అందిపుచ్చుకోవాలని అన్నారు&period; తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరప్రాంతాన్ని రక్షించుకోవడం అత్యంత ముఖ్యమని&comma; దీనికోసం మడ అడవులు&comma; తాటి చెట్ల పెంపకం వంటి మూడంచెల సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..