మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం..

మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం

Advertisements

<p>తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్ల యజమానులకు&comma; గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదం ఇంకా కొనసాగుతోంది&period; ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో సమస్య కొలిక్కి రావడం లేదు&period; దాంతో మెగాస్టార్ చిరంజీవి ఈ వివాదంలో నేరుగా రంగంలోకి దిగారు&period; హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం నిర్వహించారు&period;<br &sol;>&NewLine;పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చొరవ తీసుకున్నారు&period; ఎగ్జిబిటర్లతో గంటకు పైగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది&period; ఈ కీలక భేటీలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు&comma; కేఎల్ నారాయణ&comma; ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు&comma; మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు&period; ఈ సమావేశం అనంతరం దిల్ రాజ్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు&comma; సమస్యలు ఇన్ని ఉన్నాయాఅని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు&period; రెండు రోజుల్లో ఈ సమస్యలన్నీ సమసిపోతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు&period; మరోవైపు ఈ ఇండస్ట్రీ సమస్యలకు రాజకీయంగా&comma; ప్రభుత్వ పరంగా కూడా ఒక లైన్ క్లియర్ చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు సిద్ధమయ్యారు&period; ఇవాళ సాయంత్రం రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం భేటీ కానుంది&period; ఏపీలో చిత్ర పరిశ్రమ&comma; థియేటర్ల వ్యవస్థ బలోపేతంపై ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు వినతిపత్రం సమర్పించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..