గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీసిటీ మరో ముందడుగు..

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా శ్రీసిటీ మరో ముందడుగు

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ &comma; టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది&period; శ్రీసిటీలో క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయడంతో ఈ దిశగా ముందడుగు పడిందని చెప్పొచ్చు &period;డేటా సెంటర్ల నిర్మాణం ప్రారంభం మాత్రమేనని&comma; వాటికి అవసరమైన పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు &period; ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో డేటా సెంటర్ల పాత్ర కీలకంగా మారడంతో వాటి కోసం అవసరమైన కూలింగ్ సిస్టమ్స్&comma; పవర్ ఎలక్ట్రానిక్స్&comma; కంట్రోల్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో దేశీయ తయారీ పెరగాల్సిన అవసరం ఉంది &period; శ్రీసిటీ ఇప్పటికే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ హబ్‌గా నిలిచింది &period; వివిధ దేశాల కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్రంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా చెప్పొచ్చు &period; ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా&comma; యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు &period;<&sol;p>&NewLine;<p>ఇండియాస్ &OpenCurlyDoubleQuote;కూల్ క్యాపిటల్”గా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు&period; రాష్ట్రంలో ఏసీ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండగా&comma; 2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీలలో 60 శాతం ఏపీ నుంచే రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది&period; శ్రీసిటీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు ఈ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి&period; 8&comma;500 ఎకరాల్లో విస్తరించిన ఈ ఇండస్ట్రియల్ జోన్‌లో ఇప్పటికే వందలాది కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ వేలాది ఉద్యోగాలను కల్పిస్తున్నాయి&period; క్యారియర్ సంస్థ రూ&period;1000 కోట్ల పెట్టుబడితో 3000 ఉద్యోగాలను సృష్టించనుండడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుంది&period; డేటా సెంటర్ పరికరాల తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా గ్లోబల్ సరఫరా గొలుసులో ఏపీ కీలక స్థానాన్ని సంపాదించగలదని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు&period; 2047 నాటికి 2&period;4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..