మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం

Advertisements

<p>తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది&period; ఈ మేరకు మే 27&comma; 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు&period; పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలు ప్రత్యక్షంగా పాల్గొనగా&comma; జిల్లాలు&comma; నియోజకవర్గాలు&comma; క్లస్టర్ల స్థాయిలో నాయకులు&comma; కార్యకర్తలు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు&period; మంగళగిరిలో జరిగే మహానాడుకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు&comma; కేంద్ర కమిటీ&comma; రాష్ట్ర కమిటీ సభ్యులు&comma; అధికార ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రత్యక్షంగా హాజరవుతారు&period; అలాగే ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు&comma; మంత్రులు&comma; ఎంపీలు&comma; ముఖ్య నాయకులు తమ తమ నియోజకవర్గాల నుంచి ఆన్‌లైన్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p>పార్టీకి చెందిన 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు&comma; కార్యకర్తలు కూడా ఆయా క్లస్టర్ల నుంచే వర్చువల్‌గా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు&period; రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఒకేసారి మహానాడును వీక్షించేలా సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం&period; అంతేకాకుండా మహానాడులో ప్రవేశపెట్టే రాజకీయ&comma; ఆర్థిక&comma; సంక్షేమ తీర్మానాలు సహా అన్ని కార్యక్రమాలు సంప్రదాయ మహానాడు తరహాలోనే నిర్వహించనున్నట్లు టీడీనీ నేతలు వెల్లడించారు&period; తీర్మానాల ఆమోదం&comma; నాయకుల ప్రసంగాలు&comma; భవిష్యత్ కార్యాచరణపై చర్చలు అన్నీ హైబ్రిడ్ మోడల్‌లో కొనసాగనున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!