కోట్ల రూపాయల అద్దెలతో ప్రజాధనం వృథా..

కోట్ల రూపాయల అద్దెలతో ప్రజాధనం వృథా

Advertisements

<p>ఏపీలో చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి &period; అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ కార్యాలయాలు ఈ కోవలోకే చేరతాయి &period; రెండు దశాబ్దాలుగా అద్దె భవనాల్లోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం&comma; హెడ్ పోస్ట్ ఆఫీస్ కొనసాగుతున్న పరిస్థితి &period; కోట్ల రూపాయల విలువైన సొంత స్థలాలు ఉన్నప్పటికీ&comma; ఇంకా అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు కొనసాగించడంపై స్థానికులు మండిపడుతున్నారు&period; ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ&comma; కోట్ల రూపాయల ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సరైన సౌకర్యాలు లేమీతో కొట్టుమిట్టాడుతుంది &period; పనులు కోసం వచ్చే జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు &period; శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని పునర్నిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం&period; మరోవైపు&comma; ప్రధాన తపాల కార్యాలయం పరిస్థితి అంతే &period; విస్తృత పరిధిలో సేవలు అందిస్తూ వేలాది మంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ శాశ్వత భవనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది&period; ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కొత్త భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది&period; అద్దెల రూపంలో ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి &period; ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రామచంద్రపురంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం &comma; హెడ్ పోస్ట్ ఆఫీస్ రెండు దశాబ్దాలుగా అద్దె భవనాల్లో కొనసాగడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనంగా మారింది&period; రోజూ వందలాది మంది ప్రజలు ఈ కార్యాలయాలపై ఆధారపడుతూ సేవలు పొందుతున్నప్పటికీ&comma; సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు&period; కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడం వల్ల ప్రజాధనం అద్దెల రూపంలో వృథా అవుతోంది&period; కేంద్రం నుంచి నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు ఆలస్యం కావడం ప్రజల్లో నిరాశను పెంచుతోంది&period; ప్రజాప్రతినిధులు&comma; అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి&period; వెంటనే చర్యలు తీసుకుని సౌకర్యవంతమైన భవనాలను నిర్మించకపోతే ప్రజల సహకారంతో ఉద్యమం చేపట్టాలని స్థానిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి&period; స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా కూడా కొనసాగుతున్నారు &period;అయినప్పటికీ సొంత నియోజకవర్గంలో సమస్యను పట్టించుకోకపోవడం పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది &period;గత వైసిపి ప్రభుత్వంలో కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా కొనసాగారు &period; అప్పుడు కూడా ఈ సమస్య పై సరైన దృష్టి సారించలేదు &period; ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పెద్దలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..