బి కొత్తకోట నగర పంచాయతీగా మారినా అభివృద్ధి శూన్యం..

బి కొత్తకోట నగర పంచాయతీగా మారినా అభివృద్ధి శూన్యం

Advertisements

<p>అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి కొత్తకోట… పేరుకు నగర పంచాయతీ&comma; కానీ అసలు పరిస్థితి చూస్తే ఇది అభివృద్ధి పేరుతో జరిగిన పెద్ద మోసం అనిపిస్తోంది&period; గత ప్రభుత్వంలో రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పట్టణం ప్రజలు నేటికీ నష్టపోతున్నారు&period; నగర పంచాయతీగా ఏర్పడి ఐదేళ్లు గడిచినా తర్వాత కూడా ఒక్క శాశ్వత అభివృద్ధి పనీ జరగలేదు &period; కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పుకుంటూ పన్నులు మాత్రం రెట్టింపు చేశారు కానీ ప్రజలకు అందుతున్న సేవలు మాత్రం సున్నా&period; అధికారుల నిర్లక్ష్యం&comma; నాయకుల స్వార్థం కలిసి బి కొత్తకోటను &OpenCurlyDoubleQuote;పేరు గొప్ప ఊరు దిబ్బ”గా మార్చేశాయి&period; ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం&comma; శాశ్వత అధికారులను నియమించకపోవడం స్పష్టంగా వ్యవస్థ వైఫల్యాన్ని చూపుతోంది&period; ప్రజల అవసరాలు పట్టించుకోకుండా కేవలం వసూళ్ల యంత్రంగా మారిపోయిన ఈ నగర పంచాయతీ అధికారులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>బి కొత్తకోటలో జరుగుతున్న అక్రమాలు చూస్తే ఇది నగర పంచాయతీ కాదని&comma; ఒక అడ్డగోలుగా నడుస్తున్న వ్యవస్థ అనిపించకుండా మానదు &period; అప్రూవల్ లేని నిర్మాణాలు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు కళ్లుమూసుకుని కూర్చున్నారు&period; ముడుపుల మాయలో పడి నోటీసులు ఇచ్చినట్లు నటించి తర్వాత ఫైళ్లు మూసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; ఎదురు తిరిగే పేదలపై మాత్రం కేసులు పెట్టి బెదిరించడం&comma; వారిని భయపెట్టడం అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలుస్తుంది &period; ప్రజల సొమ్ముతో ఏర్పడిన ఆస్తులు కూడా ఆక్రమణలకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు&period; ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు&comma; ఆక్రమణదారులకు సహకారం అందించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి&period; మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులే ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి&quest; అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసి&comma; వసూళ్లతో భారం మోపడం ఇప్పుడు బి కొత్తకోటలో నిత్యకృత్యంగా మారిపోయింది&period;<&sol;p>&NewLine;<p>మౌలిక సదుపాయాల పరిస్థితి చూస్తే బి కొత్తకోటను నగర పంచాయతీగా ప్రకటించడం ఎంత పెద్ద పొరపాటు అనేది స్పష్టమవుతోంది&period; వర్షం పడితే డ్రైనేజీలు ముంచెత్తి ఇళ్లలోకి నీరు చేరుతుంది&period; రోడ్లు వెడల్పు లేకపోవడంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను చేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు&period; ఆక్రమణలతో రహదారులు కుంచించుకుపోయి ప్రమాదాలు సాధారణమైపోయాయి&period; కుక్కల బెడదతో నెలకు డజన్ల కొద్దీ కేసులు నమోదవుతున్నా అధికారులు స్పందించడంలేదు&period; ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా పెంచినా&comma; అవసరమైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు దూరప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది&period; కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ సిబ్బంది లేక పనికిరాకుండా పోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట&period; ఇది అభివృద్ధి కాదు&comma; ప్రజల డబ్బు వృథా చేసిన ఘోర సంఘటనకు నిదర్శనంగా నిలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>రైతులు&comma; సాధారణ ప్రజల కష్టాలు బి కొత్తకోటలో ఎవరికి కనిపించడం లేదు&period; చుట్టుపక్కల 300 గ్రామాల రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఆధారపడిన మార్కెట్ యార్డు మూతపడి నిరుపయోగంగా మారింది&period; రైతు బజార్లు లేకపోవడంతో రైతులు అధిక రవాణా ఖర్చులు భరించి ఇతర రాష్ట్రాలకు పంటలను తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది&period; రాత్రి 8 గంటల తర్వాత రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు&period; బస్సు డిపో లేదు&comma; బస్ షెల్టర్లు లేవు – ఇదేనా నగర పంచాయతీ&quest; అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు &period; ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేని ఈ పట్టణాన్ని నగర పంచాయతీగా ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది&period; మరింత అర్హత ఉన్న ఇతర పట్టణాలను పక్కనబెట్టి బి కొత్తకోటకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనే అనుమానం ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..