చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం..

చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది&period; SIPB సమావేశంలో దాదాపు 2లక్షల కోట్ల పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలపగా&&num;8230&semi; 39వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి&period; నిర్దేశిత గడువుకు ముందే అనుమతులతో బ్రాండ్‌ సృష్టిద్దామని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు&period; ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు&period; రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోందని &&num;8230&semi; విశాఖలో రిలయన్స్ సంస్థ ఒకలక్షా 8 వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు&period; అలాగే సత్యసాయి జిల్లాలో 51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ను&comma; బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను కూడా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది&period; కడపలో 12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును&comma; తిరుపతిలో 2 వేల 5 వందల కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది&period; వీటితో పాటు పలు పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది&period; రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతీ ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని&comma; కుదుర్చుకున్న ప్రతీ ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు&period; ఒక పెట్టుబడి&comma; పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన&comma; ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా జరిగేలా చూడాలన్నారు&period; ప్రస్తుత పోటీ ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ఎలా భిన్నమో ఏపీలో అనుమతులు ఎంత సులభతరమో వారికి చెప్పాలని స్పష్టం చేశారు&period; ఏపీలో ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులు ఇచ్చే స్థానాల్లో నియమించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..