చిత్తూరు జిల్లా స్వర్ణకుప్పం విజన్–2029పై సీఎం చంద్రబాబు సమీక్ష.

చిత్తూరు జిల్లా స్వర్ణకుప్పం విజన్–2029పై సీఎం చంద్రబాబు సమీక్ష

Advertisements

<p>స్వర్ణకుప్పం విజన్–2029 రూపకల్పనపై సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తన క్యాంప్ కార్యాలయంలో సుర్బానా జురాంగ్&comma; ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు&period;ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు&comma; మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు&period; స్వర్ణకుప్పం విజన్–2029 కోసం రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు&period;వ్యవసాయం&comma; పర్యాటక రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలు&comma; అమలు చేయాల్సిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు&period; కుప్పం భౌగోళిక స్వరూపం&comma; రవాణా సౌకర్యాలు&comma; ఉద్యానవన పంటలు&comma; వ్యవసాయ ఉత్పత్తులు&comma; పశుసంపద&comma; ప్రజల జీవన విధానం&comma; ఆదాయ వనరుల గురించి సీఎం వివరించారు&period;<&sol;p>&NewLine;<p>కుప్పం అభివృద్ధికి అన్ని రంగాలను కలుపుకొని సమగ్ర విజన్ ప్లాన్ రూపొందించాలని సూచించిన సీఎం&comma; కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రతిపాదించాలని కోరారు&period;యువత మరియు స్థానిక ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి&comma; ఉపాధి అవకాశాల సృష్టి&comma; అందుబాటులో ఉన్న వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని SJ&comma; ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు సూచించారు&period;<br &sol;>&NewLine;కుప్పానికి ఉన్న సహజ&comma; భౌగోళిక&comma; ఆర్థిక అనుకూలతలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని&comma; ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ప్రాజెక్టులను రూపొందించాలని సీఎం సూచించారు&period;అలాగే&comma; కుప్పంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో&comma; భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాంతాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని SJ&comma; ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.

భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.