కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు.

కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే-సీఎం చంద్రబాబు

Advertisements

<p>రైతుల్లో నమ్మకం&comma; ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని&comma; ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు&period; ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని&comma; కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు&period; టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు&period; రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని&comma; కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు&period; రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే&&num;8230&semi; తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు&period; సచివాలయంలో బుధవారం పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు&comma; ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు&period; మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు&comma; ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు&period;<br &sol;>&NewLine;ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు&period; రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు à°§à°° కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా&comma; మొత్తం కొనుగోళ్లు జరిపితీరాలన్నారు&period; ముఖ్యంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్&comma; గాడ్ ఫ్రే ఫిలిప్స్ &lpar;ఐ&rpar; లిమిటెడ్&comma; వీఎస్టీ ఇండస్ట్రీస్ 95&period;50 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా&&num;8230&semi; ఇప్పటివరకు కేవలం 17&period;6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు&period;<br &sol;>&NewLine;ఈ సీజన్లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు&period;<br &sol;>&NewLine;రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు&period; ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని&&num;8230&semi; దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు&period; అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు&period; పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు&period; అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా&comma; రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు&period; దీంతో à°§à°° పతనం కావడం&comma; కొనుగోళ్లు లేకపోవడం జరిగిందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.