రెండు వారాలు పర్యటనలకు దూరంగా పవన్.

రెండు వారాలు పర్యటనలకు దూరంగా పవన్

Advertisements

<p>ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వైద్యులు మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని సూచించారు&period; దీంతో ఆయన తన పర్యటనల షెడ్యూల్‌ను వాయిదా వేసి&comma; మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచే అధికారిక విధులు నిర్వహించాలని నిర్ణయించారు&period; శస్త్రచికిత్స అనంతరం అధికారిక కార్యక్రమాలకు హాజరుకావాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్&comma; పిఠాపురం&comma; పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామం&comma; రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ల పర్యటనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందికి ముందుగా సూచించారు&period;<br &sol;>&NewLine;అయితే జనసమూహం మధ్య జరిగే క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో శస్త్రచికిత్స చేసిన కుడి భుజానికి స్వల్ప అసౌకర్యం కలిగినా గాయం తిరిగి తెరుచుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు&period; అలాంటి పరిస్థితి ఏర్పడితే మళ్లీ చికిత్స చేయడం క్లిష్టమవుతుందని&comma; ఎడమ భుజంపైనా అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని వివరించారు&period; ఈ నేపథ్యంలో కనీసం మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించడంతో&comma; పర్యటనల షెడ్యూల్‌ను మార్చాలని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>అదే సమయంలో ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచే శాఖల పనులను సమీక్షిస్తూ అధికారిక విధులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.