మలకపల్లి సహకార సొసైటీ పెట్రోల్ బంక్ లో నగదు గోల్ మాల్..

మలకపల్లి సహకార సొసైటీ పెట్రోల్ బంక్ లో నగదు గోల్ మాల్

Advertisements

<p>తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి సహకార సొసైటీలో భారీగా నిధుల గోల్ మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది&period; సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్‌లో 22 లక్షల 30 వేల రూపాయల నగదు తేడా గుర్తించిన సహకార శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు&period; గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా తేలింది&period; బంక్ నిర్వహణలో ఉన్న ముగ్గురు సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; కొవ్వూరు డివిజనల్ రిజిస్ట్రార్ నిర్వహించిన ఆడిట్‌లో ఈ వ్యవహారం బయటపడింది&period; సొసైటీ చైర్మన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు&period; అధికారులు ఏడు రోజుల్లోగా నగదు తిరిగి జమ చేయాలని నోటీసులు జారీ చేశారు&period;<&sol;p>&NewLine;<p>మలకపల్లి సొసైటీ నిధుల గోల్ మాల్ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది&period; ముగ్గురు సిబ్బంది&comma; గుమస్తాతో పాటు అనధికారిక సిబ్బంది పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; సహకార శాఖ&comma; పోలీస్ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు&period; ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువకుడిని విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు సమాచారం రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది&period; అయితే విచారణలో భాగంగానే ప్రశ్నిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు&period; దుర్వినియోగమైన 22 లక్షల 30 వేల రూపాయలను రికవరీ చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి&period; సొసైటీ చైర్మన్ ఫిర్యాదు చేసినా కేసు ఆలస్యం కావడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది&period; అసలు బాధ్యులు ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం