అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.

అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు&period; వి&period;మాడుగుల మండలం&comma; జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు&period; కాగా&comma; మే 31à°¨ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి కిరణ్ అక్కడికక్కడే మరణించాడు&period; మూడేళ్ల క్రితమే చిన్న కుమారుడు కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది&period;&ZeroWidthSpace;కన్నకొడుకు చివరి చూపుకైనా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు&comma; గ్రామ పెద్దలు వి&period;మాడుగుల ఎస్ఐ నారాయణ రావు&comma; కె&period;కోటపాడు సిఐ కృష్ణను ఆశ్రయించారు&period; వారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా &comma; అదనపు ఎస్పీ ఎల్&period;మోహన రావు దృష్టికి తీసుకెళ్లారు&period; పరిస్థితిని అర్థం చేసుకున్న ఎస్పీ వెంటనే స్పందించి&comma; రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర నివేదిక పంపారు&period; ఎస్పీ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం జూన్ 2à°¨ జీవో జారీ చేస్తూ&comma; నిందితుడికి ఒకరోజు తాత్కాలిక విడుదల మంజూరు చేసింది&period;&ZeroWidthSpace;ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం&comma; పోలీస్ భద్రత నడుమ పెచ్చేటి రాజు జంపెన గ్రామానికి చేరుకుని&comma; తన కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు&period; చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ&comma; కేవలం మానవతా దృక్పథంతో స్పందించి&comma; కన్నకొడుకును ఆఖరిసారి చూసుకునే భాగ్యాన్ని కల్పించినందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు&comma; సిబ్బందికి పెచ్చేటి రాజు కుటుంబ సభ్యులు మరియు జంపెన గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.