విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

Advertisements

<p>విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి&period; వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు&comma; అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ సభ్యుల పేరిట నమోదు చేయించుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; వెదుళ్లవలస&comma; బాగువలస రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు&comma; కొండలు&comma; గుట్టలను సైతం వదలకుండా 2005&comma; 2007 సంవత్సరాల నాటి అసైన్‌మెంట్ పత్రాలను ఆధారంగా చూపిస్తూ అక్రమంగా మ్యుటేషన్లు చేయించి ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేసినట్లు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>వెదుళ్లవలస గ్రామంలో 2&period;54 ఎకరాలు&comma; బాగువలస గ్రామంలో 21&period;55 ఎకరాలు కలిపి మొత్తం 24&period;09 ఎకరాల భూమి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యుల పేరిట నమోదు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి&period; భార్య&comma; తండ్రి&comma; సోదరులు&comma; సోదరీమణుల పేర్లపై ఖాతాలు సృష్టించి ప్రభుత్వ భూమిని స్వాహా చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు&period;ప్రభుత్వ భూముల రక్షణకు ఉన్న చట్టాలను పక్కనపెట్టి అక్రమంగా రికార్డులు మార్చారని&comma; ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; జిల్లా కలెక్టర్&comma; రెవెన్యూ ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి అక్రమ మ్యుటేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు&period;గరివిడి మండలంలో కలకలం రేపుతున్న ఈ భూ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం