109
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చౌహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ షబ్ ఇ మిరాజ్ సందర్భంగా ఈనెల 8న ప్రభుత్వం సెలవు దినం ప్రకటించిందని, అదే విధంగా శివాజీ జయంతి సందర్భంగా 19న సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ గత ఏడాదిగా భారతదేశమంతట విస్తృత ప్రచారాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి శివాజీ జయంతి సందర్భంగా అధికారిక సెలవు దినాన్ని ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.