వీటివల్ల కోట్ల మంది యూజర్ల భద్రత ప్రమాదంలో పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సాంకేతిక సమస్యలు తలెత్తడం కామనే. అయితే వీటి గురించి ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం తెలియజేస్తూ యూజర్లను అప్రమత్తంగా ఉంచుతుంది. ఈ వారం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెబ్ (Microsoft Edge Browser) బ్రౌజర్లో ఒక ముఖ్యమైన భద్రతా లోపం గురించి వినియోగదారులను హెచ్చరించింది. ఈ సమాచారాన్ని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక సెక్యూరిటీ బులెటిన్‌లో వెల్లడించింది, ఇది చాలా తీవ్రమైన సమస్య (Major Security Risk) అన్నట్లు హెచ్చరించింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In ప్రకారం, ఈ బ్రౌజర్(Browser)లో అనేక సమస్యలు ఉన్నాయి. వీటిని దుర్వినియోగం చేసుకోవడం ద్వారా హ్యాకర్ డివైజ్‌పై కంట్రోల్ పొందవచ్చు, డేటాను దొంగిలించవచ్చు లేదా దాడి చేయవచ్చు.
ఆ సమస్యలేంటి?
ఈ సమస్యలు ఏవో తెలుసుకుంటే.. V8 వెబ్అసెంబ్లీ (WebAssembly)లో ఆబ్జెక్ట్ కరప్షన్ ఒకటి. ఇది హ్యాకర్ బ్రౌజర్‌ను క్రాష్ చేయడానికి లేదా దానిని నియంత్రించడానికి మార్గం సుగమనం చేస్తుంది. “యూజ్ ఆఫ్టర్ ఫ్రీ V8” సమస్య మరొకటి. హ్యాకర్ డేటాను దొంగిలించడానికి లేదా డివైజ్‌ను నియంత్రించడానికి ఈ లోపాన్ని ఉపయోగించవచ్చు.
డౌన్లోడ్స్, QUICలో సమస్యలు ఉన్నాయి. హ్యాకర్ వీటిని మాల్వేర్ను డివైజ్‌లోకి డౌన్లోడ్ చేయడానికి లేదా డేటాను దొంగిలించడానికి ఉపయోగించవచ్చు. ఫాంట్స్ చదవడంలో కూడా సమస్య ఉంది. హ్యాకర్ ఈ టెక్నికల్ ఇష్యూని డివైజ్‌ను క్రాష్ చేయడానికి లేదా దానిని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.
ఏ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వెర్షన్లు ప్రభావితమయ్యాయి?
ఈ భద్రతా సమస్య 124.0.2478.51 కంటే ముందున్న స్టేబుల్ వెర్షన్లను ప్రభావితం చేస్తుందని CERT-In తెలియజేసింది. అంటే, ఈ వెర్షన్ కంటే న్యూయర్ వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, లేటెస్ట్ ప్యాచ్ ద్వారా ప్రొటెక్షన్ లభిస్తుంది. భయపడాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్ వెర్షన్ చెక్ చేయడానికి ముందుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. త్రీ డాట్స్ మెనూపై క్లిక్ చేయాలి. “హెల్ప్ అండ్ ఫీడ్‌బ్యాక్” > “అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్”పై క్లిక్ చేసి వెర్షన్ సంఖ్యను బ్రౌజర్ విండో కింద చూడవచ్చు.
ఎలా రక్షించుకోవాలి?
ఈ రకాల భద్రతా ప్రమాదాల దారిన పడకుండా ఉండటానికి, కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌ను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు.
తెలియని ఈమెయిల్స్‌లో ఉన్న ఫైల్స్‌ను ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దు. అలానే లింక్స్‌పై క్లిక్ చేయకూడదు. మైక్రోసాఫ్ట్ ఈ సమస్యకు ఇప్పటికే సెక్యూరిటీ బులెటిన్‌ను విడుదల చేసింది. కాబట్టి, PC, ఇతర డివైజ్‌ల్లో ఎడ్జ్ బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలి. “అబౌట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్” ఆప్షన్ నుంచి కొత్త అప్డేట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిని ఎంత త్వరగా ఇన్స్టాల్ చేసుకుంటే అంత ఎక్కువ సురక్షితమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- నేడు సాయంత్రం నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-59 రాకెట్C 59 వాహక నౌక ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న మధ్యాహ్నం 2.38నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు మొదటి ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పిఎస్ఎల్వి సి- 59…
- మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రోమరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో… ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4:08 గంటలకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగించడానికి ఏర్పాట్లు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.