అరుణాచలేశ్వర స్వామి ఆలయం

Arunachaleswara Swamy Temple

Advertisements

&NewLine;<p>మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి&period; దీనిని &OpenCurlyQuote;&OpenCurlyQuote;అన్నామలై’’ అని కూడా అంటారు&period; ఈ పుణ్యక్షేత్రంలో శివుడు &OpenCurlyQuote;అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు&period; అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది&period; అరుణ అంటే ఎర్రని&comma; అచలం అంటే కొండ మొత్తంగా ఎర్రని కొండ అని అర్థం&period; దైవశాస్త్రాల ప్రకారం అరుణ అంటే పాపాలను సంహరించేది అని అర్థం&period; తమిళంలో దీనిని &OpenCurlyQuote;&OpenCurlyQuote;తిరుణ్ణాములై’’ అని పిలుస్తారు&period; పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో పుణ్య&comma; గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు&period; ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని&comma; శివుడిని భక్తితో స్మరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి&comma; విముక్తి లభిస్తుందని వేదపండితులు కూడా నమ్ముతారు&period; అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ&comma; చిదంబరం&comma; తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు&period; ఈ ప్రాంతానికి&comma; దేవాలయానికి సంబంధించి పురాణాలలో విశిష్టమైన కథలు కూడా తెలుపబడివున్నాయి&period; పురాణాల ప్రకారం పూర్వం శివుడు భూమిపై జరుగుతున్న పాపాలను&comma; దుష్టకార్యాలను&comma; అన్యాయాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు&period; దాంతో ఆయన విశ్వకర్మను ఈ అరుణాచలం ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు&period; అప్పుడు శివుని ఆజ్ఞను శిరసావహించి విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు&period; అలాగే ఆ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి&period; స్కాందపురాణంలో అంతర్గతమైన అరుణాలమహాత్యం ప్రకారం ఈ ఆలయంలో పూజావిధానం శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని విశదీకరించబడింది&period; పురాణాలలో వున్న కథనాల ప్రకారం ఈ అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని పేర్కోవడం ద్వారా ఈ కొండకు తూర్పు భాగంలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది&period; ఈ కొండకు అరుణాచలేశ్వరాలయం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా&excl; ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని అగ్ని క్షేత్రమంటారు&period; సాక్షాత్తూ పరమశివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ అరుణాచలం చుట్టూ శివునిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని&comma; ఏకంగా శివునికే ప్రదక్షిణలు చేసేంత ప్రభావం లభిస్తుందని&comma; పూర్వం మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి&period; కర్మల నుంచి విముక్తి పొందుతామని అప్పటి మహాత్ములు పేర్కొన్నారు&period; దీని ప్రాముఖ్యతను నలువైపులా విస్తరించడానికి శ్రీరమణులు కూడా పదేపదే ఉద్ఘోషించారు కూడా&excl; అందువల్ల ఈ ప్రదేశంలో వేలాదిమంది భక్తులు నిత్యం గిరిప్రదక్షిణం చేస్తూ వుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం