గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రైవేట్ బస్సుపై రాళ్ల దాడి

stones attack on private bus

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; పలమనేరు నియోజకవర్గం గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద&comma; సోమవారం రాత్రి పది గంటల 45 నిమిషాల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులపై రాళ్లు విసరడంతో ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి&comma; బిత్తర పోయిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు లోనయ్యారు&comma; ఎవరైనా దోపిడీ ముఠా ఈ విధంగా చేశారేమోనని తమను ఏమైనా చేస్తారేమోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు&comma; డ్రైవర్ బస్సు దిగి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇది మందుబాబుల పని లేదా ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారు&comma; గడచిన రెండు నెలల కాలంలో ప్రైవేటు బస్సులకు సంబంధించిన ఆరు బస్సుల మీద ఇదేవిధంగా రాళ్ల దాడి జరిగింది&comma; వేలాది రూపాయల ముందు అద్దాలు కిటికీలు ధ్వంసం చేశారని వాపోయారు డ్రైవర్లు&comma; గంటాఊరు ఫ్లైఓవర్ పక్కన రెండు డాబా హోటల్స్ ఉన్నాయి&comma;పూటుగా మద్యం తాగి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఆకతాయితనంగా కొంతమంది వ్యక్తులు బస్సులపై రాళ్లు విసరడంతోనే ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు&comma; వరుస ఘటనలతో ప్రయాణికులకు ప్రాణ సంఘటనగా మారింది&comma; దీనిపై గతంలో పోలీసులు నిఘా పెడుతున్నామని తెలిపినా&comma; ఇంతవరకు ఖచ్చితమైన ఏర్పాట్లు అయితే లేవని స్థానికులు భావిస్తున్నారు&comma; దీంతో ప్రైవేటు బస్సులు గంటాఊరు ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎక్కడ తమ బస్సులపై ఎటువైపు నుండి రాళ్ళదాడికి దిగుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తూ బస్సులు నడుపుతున్నారు&comma; కాగా రాత్రి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కచ్చితంగా నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వారికి భరోసా కల్పించారు&comma; ఏది ఏమైనా పలమనేరు గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రయాణించాలంటే వాహన చోదకులు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..

మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..