Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలపై దాడులు.. చంద్రబాబు ఆరోపణ..!

వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలపై దాడులు.. చంద్రబాబు ఆరోపణ..!

by Satya
Chandrababu

వైఎస్సార్ సీపీ(YSR CP) పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని చెప్పారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌ లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. స్వార్థం కోసం దోపిడీలు, మోసాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

హైదరాబాద్‌ లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. హజ్‌ హౌస్‌ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చంద్రబాబు చెప్పారు. కడప, విజయవాడలలో కూడా హజ్‌ హౌస్‌ లు నిర్మించామని వివరించారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్‌ కట్టించామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి.. .100 రూపాయలు దోచుకుందని ఆరోపించారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర స్థాయిలో రొట్టెల పండుగను నిర్వహించామని.. అబ్దుల్‌ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.


  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
    అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
  • వైభవంగా గోదావరి పుష్కరాలు.
    గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: