వైఎస్సార్ సీపీ(YSR CP) పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని చెప్పారు. నెల్లూరులోని షాదీ మంజిల్ లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. స్వార్థం కోసం దోపిడీలు, మోసాలకు పాల్పడే వారికి ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. హజ్ హౌస్ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని చంద్రబాబు చెప్పారు. కడప, విజయవాడలలో కూడా హజ్ హౌస్ లు నిర్మించామని వివరించారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్ కట్టించామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి.. .100 రూపాయలు దోచుకుందని ఆరోపించారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు అడ్డగోలుగా పెరిగిపోయాయని చెప్పారు. టీడీపీ హయాంలో రాష్ట్ర స్థాయిలో రొట్టెల పండుగను నిర్వహించామని.. అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
- సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు హైకోర్టు విధించిన నిబంధనలను సడలించాలని సిట్ కోరింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సీఐ నాగరాజును ఒక రోజు…
- అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు…
- ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 200816