త్వరలో అందుబాటులోకి….

Inspection of hospital construction works..

Advertisements

&NewLine;<p>సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందని అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు&comma; ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు&period; రాయచోటి పట్టణం నందు 23 కోట్లతో తుది దశకు చేరుకున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ను ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్&comma; సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్&comma; ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి&comma; కాంట్రాక్టర్ కార్తీక్ లతో కలిసి వారు ఆసుపత్రి ప్రాంగణంలోని రోడ్లను భవన నిర్మాణాలను పరిశీలించి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు&period; వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన గదులతో పాటు ఆపరేషన్ థియేటర్&comma; లిఫ్ట్&comma; ల్యాబ్&comma; రిసెప్షన్ లను కూడా పరిశీలించారు&period; 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పనులను&comma; నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఎపి సిఎం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజున ప్రారంభం చేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంగా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పెట్టుకొన్నారన్నారు&period; అయితే ఇంజినీరింగ్&comma; గుత్తేదారులు ఒక వారం సమయం ఇచ్చినట్లయితే నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమకు తెలియజేసారాన్నరు&period; ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతనే వారి నిర్ణయాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుందన్నారు&period; వారి వెంట ప్రోగ్రాం డైరెక్టర్ సాయి&comma; వైకాపా నాయకులు అన్నా సలీం&comma; బేపారి జబి బుల్లా ఖాన్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..