ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు(Bangalore) రెండో విజయం సాధించింది. హైదరాబాద్(Hyderabad)తో జరిగిన పోరులో ఆజట్టు 35 పరుగుల తేడాతో నెగ్గింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితం అయింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (40) టాప్ స్కోరర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (31), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (31) చెలరేగారు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
మిగతావారు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన డుప్లెసిస్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51, రజత్ పటిదార్ 50, కామెరూన్ గ్రీన్ 37, డుప్లెసిస్ 25 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ 2, కమిన్స్, మార్కండే ఒక్కో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వరల్డ్ చెస్ ఛాంపియన్ గా భారతీయుడుప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్…
- IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్…
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీబోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.