బాపట్ల పట్టణంలోని విలియం బూత్ జూనియర్ కాలేజీలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో 2023 గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త ప్రసంగీకులు డాక్టర్ వి రంగరాజు,ప్రముఖ సినీ గాయని ఎం ఎం శ్రీలేఖ, ప్రముఖ సంగీత విధ్వంసుడు జె క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేగేసిన మాట్లాడుతూ ప్రపంచమంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఈ క్రిస్మస్ వేడుకలను గత ఆరు సంవత్సరాల నుంచి బాపట్లలో నేను నిర్వహిస్తున్నానని, ఆ జీసస్ దయవల్ల ఈ కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను అని అన్నారు. జీసస్ దీవెనలు బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని ఆయన ఆ జీసస్ ని వేడుకొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ భారీ కేక్ కట్ చేసి అనంతరం రాజమండ్రి వారి ఆధ్వర్యంలో భారీ బాణాసంచా, క్రాకర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
అంగరంగ వైభవంగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు
68
previous post