గత బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మిల్లర్ల దగ్గర ఉన్న లెవీ ధాన్యం స్వాధీనం చేసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. ప్రతి ఏటా సివిల్ సప్లై శాఖ 3 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సిస్టం ద్వారా అమ్ముతామన్నారు. అవసరమైతే ఓపెన్ మార్కెట్‌లో బహిరంగ వేలం వేస్తామన్నారు. మిల్లర్ల వద్ద ఎలాంటి గ్యారెంటీ లేకుండా 22 వేల కోట్ల ధాన్యం గత ప్రభుత్వం పెట్టిందని మంత్రి ఆరోపించారు. అది కాకుండా కార్పొరేషన్ ఇప్పుడు 11వేల కోట్లు నష్టాల్లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం పై ఉత్తమ్ విమర్శలు..
68
previous post