హిందూ ఫార్మసీ కళాశాలలో భూమి పూజ…

Tripura Governor Indrasena Reddy

Advertisements

&NewLine;<p>విద్యార్థులు నిత్యజీవితంలో తారసపడే విషయాలపై పరిశోధనా దృష్టిని అలవర్చుకోవాలని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు&period; స్థానిక హిందూ ఫార్మసీ కళాశాల లో సిల్వర్ జూబ్లీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు&period; అనంతరం జరిగిన సభకు కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు అధ్యక్షత వహించారు&period; త్రిపుర గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ విద్యార్థులు జీవితంలో వినియోగించే వస్తువులను దృష్టి కోణంతో చూడాలన్నారు&period; దీనికి ఉదాహరణగా తనకు ఎదురైన కొన్ని సందర్భాలను వివరించారు&period; అరటి బెరడులో మంచినీటిని తాగే అలవాటు కొన్ని ప్రాంతాల్లో ఉందని&comma; అరటిబెరడు లో ఏ కెమికల్స్ ఆరోగ్యానికి సహకరిస్తున్నాయి పరిశోధించవచ్చన్నారు&period;<br>త్రిపురలో ప్రజలు గుమ్మడికాయ ఆకులతో బజ్జీలు&comma; గుమ్మడికాయ కాడలతో కూరలు చేసుకుంటారని&comma; దీని వెనుక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు&period; అలాగే అడవిలో మృగాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని చెట్ల మొదళ్లను తింటాయని&comma; ఆ మొదళ్లలో ఉన్న ఔషధ గుణాలను గుర్తించి పరిశోధన చేయాలని చెప్పారు&period; ఇలా కనిపించే ప్రతి విషయంలోను ఫార్మసీ విద్యార్థులు దృష్టి పరిశోధన దృక్పథంతో ఉండాలన్నారు&period; ఫార్మసీ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు&period;<br>బల్క్ డ్రగ్స్ తయారీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికంగా ఉందని&comma; ఈ రంగంలో ఫార్మసీ విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు&period; కళాశాల పూర్వ విద్యార్థులను కళాశాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని యాజమాన్యానికి సూచించారు&period; 125 సంవత్సరాల క్రితం సంస్కృతం నేర్పించేందుకు ప్రారంభించిన హిందూ పాఠశాల ఈరోజు అన్ని విభాగాల కళాశాలలుగా అభివృద్ధి చెంది పేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయం అన్నారు&period; ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ మధుసూదన రావు&comma; కళాశాల పూర్వ చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి&comma; లక్ష్మీపతి పగడాల సాంబశివరావు&comma; కళాశాల ప్రిన్సిపల్&comma; అధ్యాపకులు&comma; విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..