115
కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి సెగలు హాట్ టాపిక్ గా మారాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికు షాక్ తగిలింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో వెలిసిన బ్యానర్లు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందంటు ఫోన్లలో వైసీపీ నేతల గుసగుసలు వినిపించాయి. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరగుతోంది. దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా హనుమంతరావుకు గుర్తింపు ఉంది. పట్టణంలో ఏర్పాటైన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.