83
బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ…ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు. సనాతన ధర్మ వ్యాప్తి కోసం మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 22 సువర్ణ అక్షరాలతో లికించబడుతుందన్నారు. 500ఏళ్ల నాటి కల రామమందిర నిర్మాణం జరిగిందని…22వ తేది రామ మందిరాన్ని ప్రారంభించడం శుభదాయకమన్నారు. సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పూనుకున్న వారే నాశనం అయ్యారని. ఇందుకు చరిత్రే నిదర్శనమన్నారు.