ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెంలో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ప్రతీ జిల్లాలో కేంద్ర సహకారంతో చేస్తున్న అన్ని పనులు పరిశీలిస్తున్నాము, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేస్తాం. రాష్ట్రంలో జరిగే ప్రతీ అభివృద్ధి పనికి కేంద్రం సహకరిస్తుంది, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకోవాల్సి ఉండగా, ప్రతీ రాజకీయ పార్టీ డబ్బు తోడుకుంటుంది. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అన్ని వివరాలు వెల్లడిస్తాను, ఏలూరులో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 525 కోట్లు కేంద్రమే ఇచ్చింది, రేచర్ల నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కు అవుతున్న 11 వందల కోట్లు కేంద్రమే భరిస్తున్నది, రాష్ట్రం భూమి మాత్రమే తప్పా, మరేది ఇవ్వలేదు, జగనన్న కాలనీల్లో ఇళ్లు తేలిగ్గా కూలిపోయే పరిస్థితి వచ్చింది. జగనన్న ఇళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి, రాష్ట్రంలో పేదవారికి ఒక్క మంచినీటి కుళాయి ఇచ్చే పరిస్థితి లేదు, అమృత్ పథకం ద్వారా ఏలూరు కార్పొరేషన్ లో 2 వేల కోట్లు మంచి నీటి కోసం ఇచ్చింది, బీజేపీ ఓటు లేదు.. మాకు ఓటు బ్యాంకు లేకపోయినా, మాకు ప్రజల సంక్షేమమే ముఖ్యం, రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరిత పరిపాలన సాగుతోంది, ఆడుదాం ఆంధ్ధా ఏమో కానీ, ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారు, ప్రతీ విషయంలోనూ అవినీతి, ఒక్క పరిశ్రమ రాలేదు..కొత్త పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిలిపోతున్నాయీ. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. యస్ సీ, బీసీలకు రాష్ట్రంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు. అమరావతి నిర్మాణానికి టీడీపీ హయాంలో 1500 కోట్లు ఇచ్చాము. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 20వేలు కోట్లు కేటాయిస్తే, ఇంతవరకు రాష్ట్రం భూ సేకరణ చెయ్యలేదు. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్ధంగా ఉన్నాం. మాకు జనసేనతోనే పొత్తు ఉంది.. వారు మాతోనే ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనల పరిస్థితిపై సీయం చేసిన కామెంట్ల గురించి ఆయననే అడగండి.
రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది- పురంధేశ్వరి
68
previous post