సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కదన రంగంలోకి దూకబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. మొట్టమొదటి బహిరంగ సభను బిహార్‌లో నిర్వహించబోతున్నారు. బిహార్‌లోని చంపారన్ జిల్లా బేటియా సిటీలో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అదేవిధంగా బిహార్‌లో పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపాయి. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాలను గెలుచుకొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిహార్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బేటియా, బెగూసరాయ్, ఔరంగాబాద్ సభల్లో మోదీ ప్రసంగించనున్నారు. బిహార్‌లో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 39 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది.
40 స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ వ్యూహాలు..
70
previous post