కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌గా నేడు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని చేపడుతోంది. మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేందుకే ఈ “చలో మేడిగడ్డ” అన్నారు.
ఇది చదవండి: తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…
ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును పరిరక్షించకుండా కూలిపోవాలని చూస్తున్న కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే “చలో మేడిగడ్డ” కార్యక్రమాన్ని కెటిఆర్ అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిన వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు పాతరేసేందుకు మేడిగడ్డకు పోతున్నామన్నారు. మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడేనని కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి