75
హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విజయభాస్కర్ తో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఫోన్ లో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వాటి గురించి ఇలా చేయడం సరికాదని విజయభాస్కర్ కు నచ్చ చెప్పారు. ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నానని, అందుకే ఆత్మహత్యయత్నం చేశానని విజయభాస్కర్ తెలిపారు.