విశాఖ పోర్టు(Visakha Port)లో 25 వేల కిలోల డ్రగ్స్(Drugs)..
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) విస్మయం వ్యక్తం చేశారు. వైసీపీ(YCP) పాలనపై మండిపడ్డారు. విశాఖ పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్(Drugs)ని సీబీఐ స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందన్నారు. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు(AP Police), పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్(Drugs) క్యాపిటల్‌గా మారిపోయిందని విచారం వ్యక్తం..
ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ(YCP) అధిష్టానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్‌గా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని, ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎస్సై దురుసు ప్రవర్తనతో వ్యక్తి ఆత్మహత్య…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి