టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తన మార్క్ రాజకీయం(Politics) చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బాబు…. గెలుపు గుర్రలకే టిక్కెట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరూ సీనియర్ నేతలకు ఈ సారి బాబు సీట్లు నిరకరిస్తున్నారు. మొదటి జాబితాలో సీటు దక్కని సీనియర్లు రెండో జాబితాలోనైనా టిక్కెట్ వస్తుందని ఆశించారు. కానీ రెండో సారి కూడా నిరాశే ఎదురైంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) అడుగులు వేస్తున్నారు. గెలిచే సత్తా ఉన్నా నాయకులకే పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ సీనియర్లు, జూనియర్లు, ధనికి, పేద అనే తారతామ్య భేదం చేడటం లేదు. కేవలం గెలిచే సత్తా ఉంటే చాలు టికెట్ గ్యారంటీ అన్న విధంగా బాబు వ్యవహర శైలి ఉంది. మొదటి నుంచి టికెట్ పై ఆశాలు పెట్టుకున్న సీనియర్ నాయకులకు ఈ సారి సీట్ ఇవ్వలేదు. ఎచ్చెర్ల నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి సీనియర్ నేత కళా వెంకట్రావు, విశాఖ నుంచి సీటు ఆశిస్తున్న గంటా శ్రీనివాసరావు, పెందుర్తి టికెట్‌పై ఆశాలు పెట్టుకున్నమాజీ మంత్రి బండారు సత్యనాయరణ, మైలవరం టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు రెండో జాబితాలో కూడా టికెట్ ఇవ్వలేదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సీనియర్ల కు టికెట్ నిరకరించడానికి ప్రధాన కారణం సర్వే అని తెలుస్తుంది. పలు దఫాలుగా సర్వేలు చేయించిన బాబు ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి సీటు ఇస్తే గెలుస్తారు అనే దానిపై ప్రధానంగా దృష్టి సారించి సర్వే చేయించారు. అందుకు అనుగుణంగా కొత్త, పాత కలయికగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. తొలి జాబితాలో కొత్త వారితో పాటు యువతరానికి పెద్దపిట వేస్తే….రెండో జాబితాలోనే అదే విధంగా చేశారు. ఇవాళ ప్రకటించిన 34 మందిలో 27మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారు. వీరిలో పిహెచ్డీ చేసిన వారు ఒకరు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు 11 మంది, గ్రాడ్యుయేట్ చేసిన వారు 9 మంది, ఇంటర్మీడియట్ చేసిన వారు 8 మంది, పదో తరగతి చదివిన వారు 5 మంది ఉన్నారు. ఇందులో 25 నుంచి 35 వయసు ఉన్న వారు ఇద్దరు కాగా….36 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 8 మంది, 46 నుంచి 60 వయసు ఉన్న వారు 19 మంది ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే సీనియర్లకు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరూ యంగ్ స్టర్స్ ఉన్నారు.
ఇది చదవండి : చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను కాల్చిన వైసిపి నాయకులు
ఏది ఏమైనప్పటికీ విజయం సాధించాలంటే మోహమాటం పనికి రాదని… అందులో రాజకీయల్లో మరి అని బాబుకు బాగా అర్థమైనట్టు ఉంది. అందుకే గెలుపు గుర్రలకు పెద్దపీట వేస్తూ… సీనియర్లను, పార్టీ కోసం పని చేస్తున్న వారికి పార్టీ అధికారంలోకి వస్తే మీకు సరైన ప్రాధాన్యత ఇస్తానంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి