తుపాను పై నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ

chandrababu

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుపానుతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు&period; తుపాను కారణంగా రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని&comma; ప్రాణ ఆస్తినష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు&period; తుపాను తీవ్రత దృష్ట్యా మిచాంగ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు&period; ప్రాథమిక అంచనా ప్రకారం 22 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్ట పోయారన్నారు&period; తుపాను రూ&period; 10 వేల కోట్ల వరకు పంట నష్టం ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు&period; దాదాపు 770 కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు&period; తాగునీరు&comma; నీటిపారుదల&comma; విద్యుత్&comma; కమ్యూనికేషన్ రంగాలతో పాటు ఆక్వా రంగం కూడా నష్టపోయిందని తెలిపారు&period; పంట నష్టపోయామనే ఆవేదనతో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లేఖలో తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..