బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన

chandrababu

Advertisements

&NewLine;<p>టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు&period; ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు&period; బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు&period; తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు&period; విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు&period; కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు&period; తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు&period; వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు&period; బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు&period; ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు&period;అంతేకాదు&comma; టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ&period;5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు&period; తుపాను బాధితులకు ప్రభుత్వం రూ&period;25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..